ఇంటి వెలుగులు | - | Sakshi
Sakshi News home page

ఇంటి వెలుగులు

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

ఇంటి వెలుగులు

చిన్నారి పాపలం

చిరునవ్వు దివ్వెలం

ఇంటిలో వెలుగులం

కంటిలో పాపలం

అమ్మ ఒడి మాకుగుడి

నాన్న మది మా ప్రేమనిధి

ఇద్దరి మాటలు వింటాము

చక్కగ బడికి వెళతాము

బడిలో పాఠం నేర్చుకొని

బంగరు బాటన పయనిస్తాము

పెద్దల దీవెన లందుకొని

విద్యలో విజయం సాధిస్తాము

– బూర దేవానందం,

సిరిసిల్లటౌన్‌

Advertisement
 
Advertisement
Advertisement