మైదానంలో చిరుతలు | - | Sakshi
Sakshi News home page

మైదానంలో చిరుతలు

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

చక్కని అవకాశం క్రమం తప్పకుండా వెళ్తున్నా స్నేహితులతో కలిసి సాధన శిక్షణ బాగుంది క్రికెట్‌ ఆడతాను

● ఆటల్లో శిక్షణ.. భవితకు రక్షణ

● ఉత్సాహంగా

వేసవి శిబిరాలు

● కరాటే, కబడ్డీ,

క్రికెట్‌లో ట్రెయినింగ్‌

జిల్లాలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు సందడిగా మారాయి. భవిష్యత్‌లో క్రీడాకారులుగా తయారయ్యేందుకు ఇది చక్కటి అవకాశం. శిక్షణ సమయంలో విద్యార్థులకు క్రీడలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఒక్కో విభాగంలో 30 నుంచి 40 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరాలు జూన్‌ 6 వరకు కొనసాగుతాయి.

– ఎ.రాందాస్‌, జిల్లా యువజన,

క్రీడలశాఖ అధికారి

ప్రతీ రోజు స్టేడియానికి వెళ్తున్నాను. వాలీబాల్‌ ఇష్టం. కోచ్‌లు మంచి మెలకువలు నేర్పుతున్నారు.

– తులసీకృష్ణ, సిరిసిల్ల

కరాటే అంటే ఇష్టం. గత మూడేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకుంటున్నాను. వేసవి సెలవుల్లో ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా కరాటేలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటున్నాను.

– లాస్యప్రియ, రాజీవ్‌నగర్‌

నాకు కబడ్డీ ఇష్టం. మినీస్టేడియంలో ఉంటూ మెలకువలు నేర్చుకుంటున్నాను. కోచ్‌లు మంచిగా శిక్షణ ఇస్తున్నారు. నేను ముస్తాబాద్‌ గురుకులంలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాను.

– రాంచరణ్‌, ఇల్లంతకుంట

క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. కొండాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాను. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు ఉంటాయని కోచ్‌లు తెలిపారు. అందుకే ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను.

– బన్నీ, కొండాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement