బన్నీ వేసవి యాత్ర –16 గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర –16 గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

బన్నీ వేసవి యాత్ర –16 గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌

సాయంత్రం బన్నీ, స్వప్న, రామ్‌, చుక్క తాతయ్య దగ్గర కూర్చున్నారు.

తాతయ్య అన్నాడు: ‘మీ శరీరం మీది. మీ అనుమతి లేకుండా ఎవరూ ముట్టుకోకూడదు.’

‘అమ్మ కౌగిలి , నాన్న ముద్దు, స్నేహితుల కరచాలనం – ఇవి గుడ్‌ టచ్‌. మనకు సంతోషంగా ఉంటుంది’ అని చెప్పాడు.

‘బ్యాడ్‌ టచ్‌ అంటే? మనకు భయం, బాధ, సిగ్గు కలిగితే అది బ్యాడ్‌ టచ్‌’ అని వివరించాడు.

రామ్‌ అడిగాడు: ‘అలా జరిగితే ఏం చేయాలి తాతయ్యా?’

తాతయ్య 3 టిప్స్‌ చెప్పాడు:

1. గట్టిగా ‘వద్దు’ అని అరవాలి.

2. అక్కడి నుంచి పరిగెత్తాలి.

3. వెంటనే నమ్మకమైన పెద్దవాళ్లకు చెప్పాలి.

చుక్క: అమ్మకు చెప్తాను. టీచర్‌కి చెప్తాను.

స్వప్న అడిగింది: ‘తెలిసిన వాళ్లయితే?’

తాతయ్య అన్నాడు: ‘ఎవరైనా సరే, నీకు నచ్చకపోతే వద్దు అనే.’ చెప్పాలి.

తాతయ్య గట్టిగా చెప్పాడు: ‘తప్పు మీది కాదు. ధైర్యంగా చెప్తేనే మనం జాగ్రత్తగా ఉంటాము.’

బన్నీ అందరికీ చెప్పాడు: ‘మన శరీరం. మన నియంత్రణ. గుడ్‌ టచ్‌ పర్వాలేదు. బ్యాడ్‌ టచ్‌ చేయనివ్వకూడదు.’

పిల్లలకి మాట:

భయం వద్దు. మౌనం వద్దు.

‘వద్దు’ అని గట్టిగా చెప్పాలి.

విషయం అమ్మకు, టీచర్‌కు చెప్పడమే అసలైన ధైర్యం.

కోట లక్ష్మణ్‌, ఎస్జీటీ

ఎంపీపీఎస్‌,

కాకర్లపల్లి

మండలం : మంథని

జిల్లా : పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement