1. రామ భక్తుడు కొండ ఎక్కింది ఎక్కడ?
2. ఏం చెప్పినా ఆలకించే కొండ.. ఎక్కడ ఉంది?
3. ఈ కొండకు గట్టు కట్టారు.. ఎక్కడో చెప్పండి?
4. ఈ మహాకొండ.. రాయల వారి రాజధాని కూడా?
5. ఈ కొండలో పల్లెటూరుంది.. బొమ్మలకు ప్రసిద్ధి కూడా?
6. ఇక్కడ ఏడు కొండలుంటాయి. శ్రీహరి నివాసమది. ఎక్కడ?
7. భువనానికి కొండ తోడయితే వచ్చే ఊరు పేరు?
8. శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో పైకెత్తిన కొండ పేరు?
9. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన కోటపేరు?
10. ప్రభలతో తిరునాళ్లకు ప్రఖ్యాతి చెందిన కొండ ఎక్కడ?
11. రెడ్డి రాజులు కట్టించిన కోట?
12. మన రక్తం తాగి జబ్బుల్నిచ్చే జీవితో వచ్చే కొండ?
13. ఈ కొండకు గుత్తి ఉంది. అదెక్కడ?
14. ఏం మరిచినా శ్రీయాద్‌శ్రీ చేసే కొండ ఎక్కడ ఉంది?
డాక్టర్ కందేపి రాణిప్రసాద్
మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల
జవాబులు: 1.హనుమకొండ,
2. వినుకొండ, 3. కొండగట్టు,
4. పెనుగొండ, 5. కొండపల్లి,
6. తిరుపతి, 7. భువనగిరి,
8. గోవర్ధనగిరి, 9. గోల్కొండ, 10.కోటప్పకొండ, 11. కొండ వీడు, 12. దోమకొండ, 13. గుత్తికొండ, 14. యాదగిరి.


