బక్రీద్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

బక్రీద్‌కు పకడ్బందీ ఏర్పాట్లు ● విద్యార్థులకు ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌ సూచన

కొత్తపల్లి(కరీంనగర్‌): బక్రీద్‌ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ చిత్రా మి శ్రా తెలిపారు. రేకుర్తి ఈద్గా వద్ద బక్రీద్‌ ఏర్పాట్లును సీపీ గౌస్‌ ఆలంతో కలిసి శనివారం సా యంత్రం పరిశీలించారు. ప్రత్యేక ప్రార్థనలకు ఎంత మంది హాజరవుతారు.. సౌకర్యాల కల్ప నపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బక్రీద్‌ సందర్భంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమశాఖ, మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ముస్లిం మత పెద్దలు పలు అంశాలను జిల్లా కలెక్టర్‌, సీపీ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్‌ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎండాకా లం దృష్ట్యా పెద్ద మొత్తంలో కూలర్లు , లైటింగ్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్‌, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

కరీంనగర్‌: పదో తరగతిలో సాధించిన విజ యంతో ఆగిపోకుండా విద్యార్థులు ఉన్నత శిఖ రాలను అధిరోహించాలని హైదరాబాద్‌ ఈగల్‌ ఎస్పీ ఆర్‌.గిరిధర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని వెంకట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివా రం నిర్వహించిన ‘గంప వజ్రమ్మ విద్యా పురస్కారం’ ‘వై రఘునాథం ఎక్స్‌లెన్సీ అవార్డు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ కనబర్చిన విద్యార్థులు పురస్కారాలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘వై రఘునాథం ఎక్స్‌లెన్సీ’ అవా ర్డును లయన్‌ కొండా వేణుమూర్తికి అందించారు. ఐఆర్‌ఎస్‌ ఎస్‌.మురళీమోహన్‌, సీవీ. రావు, వి.పూజ విద్యార్థులకు దిశానిర్దేశం వెంకట్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న బాల గోకులం అనాథ శరణాలయ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ కోడింగ్‌, ఆంగ్ల భాషలో శిక్షణ అందించిన హైకోర్టు న్యాయమూర్తి ఈవీ.వేణుగో పాల్‌ సంతానం ఈవీ.రిషిత, ఈవీ.ఆర్యన్‌సాయికి ప్రత్యేక సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 185 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌, ప్రధానోపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.

విధుల్లో ప్రమాణాలు పాటించాలి

కరీంనగర్‌క్రైం: ప్రజా ప్రతినిధులు, వీఐపీ భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పీఎస్‌వోలు, బాంబ్‌ డిస్పోజల్‌ , డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది అత్యంత అప్రమత్తత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌ ఆదేశించారు. శనివారం కమిషనరేట్‌కేంద్రంలోని తన కార్యాలయంలో ఏఆర్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రతాప్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రామాణిక విధానాలు పాటించాలని స్పష్టం చేశారు. వీఐపీల భద్రతే ప్రథమ కర్తవ్యంగా భావించాలన్నారు. ఆయుధాల నిర్వహణ, రూట్‌ చెకింగ్‌, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. వీఐపీల ప్రయాణ ప్రణాళికల గోప్యతను పాటించాలన్నారు. హ్యాండ్లర్లు తమ శునకాలతో ప్రేమ, ఓపికతో వ్యవహరిస్తూ వాటి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్‌ఐ(అడ్మిన్‌) రజినీకాంత్‌, ఆర్‌ఎస్సైలు నీలవేణి రాజు, కార్తీక్‌ పాల్గొన్నారు.

రేషన్‌ డీలర్ల ఎంపిక పూర్తి

కరీంనగర్‌ అర్బన్‌: ఎట్టకేలకు రేషన్‌ డీలర్ల నియామక ప్రకియ పూర్తయింది. శనివారం ఫలితాలు ప్రకటించగా 55మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కరీంనగర్‌ ఆర్డీవో కుందారపు మహేశ్వర్‌ ప్రకటించారు. మార్చి 28, 2025న నోటిఫికేషన్‌ జారీ చేయగా 55 చౌకధరల దుకాణాలకు గానూ 391 అభ్యర్థులు పరీక్షకు హాజరవగా 1:5 నిష్పత్తిలో 218 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు నిర్వహించారు. రాత పరీక్ష, ఇంటర్వూలో సాధించిన మార్కుల క్రమంలో మెరిట్‌ సాధించిన 55 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆర్డీవో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement