రైస్‌మిల్లర్లు తప్ప, తాలు పేరిట కోతలు విధిస్తున్నారు. 40 కిలోల బస్తాకు 2–5 కిలోల వరకు కట్ చేస్తున్నారు. మిల్లుకు వెళ్లిన లారీని దించుకోకపోవడం, తప్ప, తాలు ఉందని వెనక్కి పంపిస్తున్నామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్‌తో ఏదో మాట్లాడుకోమని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. చేసేదేమి లేక రైతులు మిల్లర్లను బతిమిలాడి వారు చెప్పినంత ధాన్యం కటింగ్‌కు ఒప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రైతులు మిల్లర్లపై ఫిర్యాదు చేయలేదు. ఒక వేళ చేసినా పట్టించుకునే అధికారులు లేరు.


