శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లో)
ఉమ్మడి జిల్లాలో ఆల్‌టైం రికార్డు ఉష్ణోగ్రతలు ● ఉదయం ఏడుగంటల నుంచే సూర్యుడి ప్రతాపం
రాత్రి ఏడు గంటల వరకూ వేడిగాలులు ● అత్యవసరమైతే తప్ప.. బయటకు వెళ్లొద్దని అధికారుల సూచన
సాక్షి పెద్దపల్లి:
ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. భాను డి ప్రతాపంతో శుక్రవారం ఆల్‌టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడిమి, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఇంటినుంచి బయటకు రాలేకపోతున్నా రు. రాత్రి ఏడుగంటల వరకూ వడగాలులు తగ్గడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుండగా, చిరువ్యాపారులు మధ్యాహ్నం వేళ బ్రేక్ ఇస్తున్నారు. ఎండ నేపథ్యంలో రోజువారీగా రద్దీగా కనిపించే ప్రధా న కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి.
రెడ్‌జోన్‌లో ఉమ్మడి జిల్లా
వాతవరణశాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మించి నమోదైతే రెడ్‌జోన్‌గా ప్రకటిస్తారు. వారం రోలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగటున 45 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగత్రలు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత దంచి కొడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కార్మికులు వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తాగినా వేడినుంచి ఉపశమనం లభించడం లేదని వాపోతున్నారు.
ఇళ్లనుంచి బయటకు రావొద్దు
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డాక్టర్లు చెబుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. పండ్లరసాలు, మజ్జిగ వంటిని తాగాలని సూచనలు ఇస్తున్నారు. ఈనెల 25న రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వడ దెబ్బ లక్షణాలు
మగత లేదా మూర్ఛ, వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, అసాధారణంగా ముదురు పసుపు రంగులో తక్కువ పరిమాణంలో మూత్రవిసర్జన, వేగవంతమైన శ్వాస, హృదయ స్పందన వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవపదార్థాలు తాగాలి. ఆ వెంటనే వైద్య సాయం పొందాలి. వడదెబ్బతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తారసపడితే దుస్తులు తొలగించి చల్లని నీటితో లేదా తడిబట్టతో తుడవాలి.
ఽజైన, ధర్మపురి 46.4
గంగాధర 46.4
కమాన్‌పూర్ 46.4
మర్తన్నపేట 46.4


