ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

● అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయండి ● జిల్లాస్థాయి సభలో కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. జిల్లాలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సభ శుక్రవారం జరగగా మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, సీపీ గౌస్‌ ఆలం హాజరయ్యా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 99 రో జుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా 10 అంశాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రతి గ్రామం పర్యటించి ప్రజలతో మమేకమయ్యారని, సమస్యలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. చివరి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేవరకు చర్యలు తీసుకుంటామన్నారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సి పాలిటీలో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించామని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ 66 డివిజన్లలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించడం ద్వారా సానిటేషన్‌ని మెరుగుపరిచామని తెలిపారు. డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి హెల్ప్‌ డెస్క్‌

గ్రామాల్లో సర్పంచుల సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ డీపీవోను ఆదేశించారు. హెల్ప్‌ డెస్క్‌ నిర్వహణకు నంబర్లు కేటాయించి సర్పంచులకు తెలియజేయాలన్నారు. పంచాయతీ రాజ్‌ చట్టం 2018 ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల జమా ఖర్చులను పర్యవేక్షించాలని, తద్వారా సిబ్బంది వేతనాలు, గ్రామపంచాయతీ విద్యుత్‌ బిల్లులు వంటివి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement