కరీంనగర్: కరీంనగర్ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన చర్లపల్లి భారతి చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు, పార్థీవదేహాన్ని దానం చేశారు. అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో గురువారం కన్నుమూసిన భారతి కళ్లను అమ్మ ఐ ఆర్గాన్ బాడీ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గంజి ఈశ్వర్ లింగం ఆధ్వర్యంలో, వాసన్ ఐ బ్యాంక్ సహకారంతో సేకరించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం భారతి పార్థివ దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. కుటుంబ సభ్యులు చర్లపల్లి కుమారస్వామి– వనజ, శ్రీధర్– నాగరాణి, విజయలక్ష్మి– రాజయ్య, అరుణ– శ్రీనివాస్ సేవాభావాన్ని ప్రముఖులు అభినందించారు. ప్రముఖ కవులు నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు భారతి పార్థివ దేహానికి నివాళి అర్పించారు.


