బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

సిరిసిల్ల అర్బన్‌: రెండు రోజుల్లో బహ్రెయిన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నక్క పర్శరాములు శుక్రవారం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన నక్క పర్శరాములు(41) కొంతకాలంగా ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి, వస్తున్నాడు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన పర్శరాములు శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని తన బంధువుల ఇంటికి పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలోనే అపెరల్‌పార్క్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పర్శరాములును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. సోమవారం నాడు బహ్రెయిన్‌ వెళ్లేందుకు టికెట్‌ సైతం బుక్‌ చేసుకున్నాడు. మృతునికి భార్య వాణి అలియాస్‌ కవిత, కొడుకులు రిషిత్‌, నిహాల్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement