న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026
ఎండల తీవ్రతకు జిల్లా రెడ్‌జోన్‌లో కొనసాగుతుండగా.. వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గురువారం 46 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నగర శివారులోని డీర్‌పార్క్‌లో జంతువులు, పక్షుల పరిస్థితి వర్ణనాతీతం. ఎండల తీవ్రతతో నెమళ్లు, జింకలు, నిలుగాయి తదితర పక్షులకు ఉపశమన చర్యలు చేపట్టారు. వడగాలులకు తట్టుకోలేక నెమళ్లు సొమ్మసిల్లిపోతుండగా.. రేకులపై తుంగ కప్పి నీటిని జలకరిస్తున్నారు. కొలనుల్లో మూడు పూటల నీటిని మార్చుతుండడంతో జలకాలాటతో సేదదీరుతున్నాయి. జింకలకు స్నోపాల్స్ షెడ్డు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం వేళలో చల్లటి నీటిని అందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
నీటి తడితో ఉపశమనం పొందుతున్న కుందేలు పిల్లలు
నీటి జల్లుల మధ్య, షెడ్డు నీడన సేద తీరుతున్న నెమలి
పార్కులో పక్షికి నీరు పడుతున్న సహాయకుడు


