నేడు ఏబీసీ భవనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు ఏబీసీ భవనం ప్రారంభం

May 22 2026 4:22 AM | Updated on May 22 2026 4:22 AM

● మేయర్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు ● గంటల్లోనే భవనానికి విద్యుత్‌ కనెక్షన్‌ టీజీఎన్పీడీసీఎల్‌లో ‘వన్‌ మినిట్‌ రూల్‌’ అమలు

● మేయర్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు ● గంటల్లోనే భవనానికి విద్యుత్‌ కనెక్షన్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ నిర్మించిన యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ)సెంటర్‌ భవనం ఎట్టకేలకు ప్రారంభానికి నోచుకొంటోంది. ‘అరుస్తూ.. కరుస్తూ’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంటల్లోనే భవనానికి విద్యుత్‌ సరఫరా చేశారు. దీంతో బొమ్మకల్‌లో రూ.35 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని శుక్రవారం మేయర్‌ ప్రారంభించనున్నారు. ఇకనుంచి ఈ నూతన భవనంలో కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌ వేగవంతం చేయాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనను వేగవంతం చేయాలని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని సుడా కార్యక్రమాలను సమీక్షించారు. కరీంనగర్‌ నుంచి కలెక్టర్‌ చిత్రామిశ్రా, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మాస్టర్‌ప్లాన్‌ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు.

గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం ఏకగ్రీవం

కరీంనగర్‌ టౌన్‌: కరీంనగర్‌లోని వాగేశ్వరి కళా శాలలో గురువారం 2026– 27 ఏడాదికి తెలంగాణ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పరంకుశం రాజభాను చంద్రప్రకాశ్‌ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.లక్ష్మణ్‌ రావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.మధుసూదనాచారి, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఎస్‌.చంద్రకళ, చీటి లక్ష్మణ్‌ రావు, కరుణ, టి. ఆనందం, రంగనాథ్‌శర్మ, హెడ్‌క్వార్టర్స్‌ సెక్రట రీగా ఆంజనేయులు, జాయింట్‌ సెక్రటరీలుగా హేమలత, రవీందర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ లుగా అర్షద్‌, ఆర్‌.రాజయ్య, ఎస్‌.దామోదర్‌, రాష్ట్ర కౌన్సిలర్లుగా జయప్రద, కృష్ణ గోపాల్‌, అనితారాణి, రామయ్య ఎన్నికయ్యారు. చంద్రప్రకాశ్‌ మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు హర్షించదగ్గవని, ప్రధానోపాధ్యాయులు ఈ సంస్కరణల ఫలాలకు దూరంగానే ఉన్నారని పేర్కొన్నారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): ‘ఒక్క నిమిషం ఆలోచన– జీవితాంతం భద్రత’ అనే సందేశంతో ‘వన్‌ మినిట్‌ రూల్‌’ను టీజీఎన్పీడీసీఎల్‌లో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎస్‌ఈ ఆర్‌.రవీందర్‌ తెలిపారు. కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ఒక నిమి షం సమయం తీసుకుని భద్రతా ప్రమాణా లను సమగ్రంగా పరిశీలించడం ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యుత్‌ ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్‌ సరఫరా వ్యవస్థను సురక్షితంగా నిర్వహించడం లక్ష్యంగా సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఈ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. వన్‌ మినిట్‌ రూల్‌లో భాగంగా లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) పొందిన విషయాన్ని నిర్ధారించుకోవడం ఇండక్షన్‌ టెస్టర్‌తో లైన్‌లో విద్యుత్‌ సరఫరా లేదని పరీక్షించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) సరిగా ధరించడం, ఎర్తింగ్‌ వ్య వస్థ సక్రమంగా ఏర్పాటు చేయడం, పని ప్రదేశంలో ప్రమాదాల అవకాశాలు ఉన్నాయా అని పరిశీలించడం, డబుల్‌ ఫీడింగ్‌ జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవడం, టీమ్‌ సభ్యులందరూ అప్రమత్తంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడం వంటి అంశాలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు.

పి.లక్ష్మణ్‌ రావు,

అధ్యక్షుడు

మధుసూదనాచారి, ప్రధాన కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement