జమ్మికుంట: మొక్కజొన్న రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుండగా, అడ్తిదారులు అడ్డదారిలో తక్కువ ధరకు మక్కలు కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు బినామీ పేర్లతో విక్రయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. జమ్మికుంట మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పార్టీ పట్టణాధ్యక్షుడు కొలకాని రాజుతో కలిసి సందర్శించారు. మార్కెట్ అధికారులు, ట్రేడర్లు కుమ్మకై రైతుల నుంచి రూ.1600 నుంచి రూ.1800కు కొనుగోలు చేసి, ఇతరుల పేరుతో పంటను అమ్ముకుంటున్నారని అన్నారు. అనంతరం తాహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు పు ప్పాల రఘు, కనుమల్ల గణపతి పాల్గొన్నారు.


