కరీంనగర్‌క్రైం: జిల్లా జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయ సలహా కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి టి.రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖైదీలతో పాటు వారి సంబంధీకులకు న్యాయసాయం కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఖైదీల విభాగాలను పరిశీలించి, స దుపాయాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు లాయర్‌ను పెట్టుకునే స్థోమత లేని వారికి ఉచితంగా న్యాయసాయం అందిస్తామన్నా రు. జైలు సూపరింటెండెంట్ విజయదేని, జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.


