జిల్లాసభను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

జిల్లాసభను విజయవంతం చేయండి

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 22న శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించే జిల్లాస్థాయి సభను విజయవంతం చే యాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. జిల్లాస్థాయి సభ నిర్వహణపై వివిధశాఖల జిల్లా అధికా రులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగ తి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం నుంచి జిల్లాస్థాయిలో వివిధశాఖల ద్వారా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, వాటన్నింటినీ డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలన్నారు. ప్రతీశాఖకు సంబంధించిన ప్రగతిపై పది నిమిషాల సమాచారం సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి, సన్న రకం వరికి బో నస్‌, కొత్త రేషన్‌ కార్డుల లబ్ధిదారుల వివరాలు సభలో వివరించాలని తెలిపారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో సభను విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement