సుల్తానాబాద్‌రూరల్: కోడి పందెం ఆడుతున్న 14మందిని అరెస్టు చేశామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఎలిగేడు మండలం శివపల్లి శివారుల్లోని బోడగుట్ట వద్ద రాహస్యంగా కోడి పందేలు ఆడుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేశారు. దుగ్యాల కార్తీక్‌రావు(శివపల్లి), గడ్డం రాజేశ్(ఇందారం), ఒజ్జ శంకర్(శివపల్లి), బత్తుల రాజు(పెద్దపల్లి), సల్లూరి పవన్(మందమర్రి), పొట్లపల్లి మనోహర్, ఎండీ.రహీం(గోదావరిఖని), వెన్న రవీందర్(ఇందారం), వెల్పుల సతీశ్(ఇందారం), పులి నాగరాజు(పెద్దపల్లి), కొల్లూరి మహేశ్(రామగిరి), ఎండీ సమాద్(జైపూర్), సింగరపు అఖిల్‌వర్మ(పెద్దపల్లి)ను అరెస్టు చేసి 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 13 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, కారు రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పెటీ, అర్గనైజిడ్ క్రైం, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టూ యానిమల్స్ యాక్ట్ 1960, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 కింద కేసు నమోదు చేశారు. పందెం రాయుళ్లను చాకచక్యంగా పట్టుకున్న సీఐలు రంజిత్‌రావు, ప్రవీణ్, ఎస్సైలు చంద్రకుమార్, సనత్‌రెడ్డి, శ్రీధర్, నరేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.


