బండి భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

May 19 2026 12:22 AM | Updated on May 19 2026 12:22 AM

కరీంనగర్‌టౌన్‌: మైనర్‌ బాలిక విషయంలో అరెస్ట్‌ అయిన బండి భగీరథ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి ఫ్లెక్సీ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, పొన్నం అనిల్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి, అశోక్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement