తెలుసుకునేలోపే అయిపోయింది | - | Sakshi
Sakshi News home page

తెలుసుకునేలోపే అయిపోయింది

May 19 2026 12:22 AM | Updated on May 19 2026 12:22 AM

తెలుసుకునేలోపే అయిపోయింది ఎలాంటి చెడు అలవాట్లు లేవు

మా అమ్మ సుశీల గృహిణి. వ్యవసాయం, ఇల్లు తప్ప మరే వ్యాపకాలు లేవు. ఇటీవల అకస్మాత్తుగా అమ్మ అనారోగ్యం పాలయ్యారు. వైద్యపరీక్షల్లో ఆమెకు కేన్సర్‌ అని తెలుసుకుని అవాక్కయ్యాం. అది కూడా ఫోర్త్‌ స్టేజ్‌ కావడంతో ఏమీ చేయలేకపోయాం. తక్కువ వ్యవధిలోనే అమ్మను కోల్పోయాం. మా అమ్మకు కేన్సర్‌ ఎలా సోకింది? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.

– నల్ల శ్రవణ్‌రెడ్డి

మా నాన్న ప్రతాపరెడ్డి. స్థానిక మిల్లులో ఆపరేటర్‌గా పనిచేసేవారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కనీసం కల్లు కూడా తాగే వారు కాదు. మంచి ఆరోగ్యంగా ఉండేవారు. కానీ, అకస్మాత్తుగా ఆయనకు కేన్సర్‌ అని తెలిసి ఆశ్చర్యపోయాం. చికిత్స జరుగతుండగానే ఆయన మరణించారు. స్థానికంగా కాలుష్యం వల్ల కూడా ఆయనకు కేన్సర్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం. – అన్నాడి కృష్ణారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement