గుండెపోటుతో ఉపాధిహామీ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉపాధిహామీ కూలీ మృతి

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తిలో సోమవారం గుండెపోటుతో ఉపాధి కూలీ అంకతి మల్లవ్వ (56) మృతి చెందారు. గ్రామశివారులో కొత్త రాముని గుండ్లవద్ద కంటూరు కందకాలు తవ్వేందుకు వెళ్లిన ఆమె పనులు చేస్తుండగానే చాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలిపోయింది. తోటి కూలీలు మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సుల్తానాబాద్‌రూరల్‌: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారు రాజీవ్‌ రహదారిపై సోమవారం ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని జుపక రాహుల్‌(27)అనే సెంట్రింగ్‌ వర్కర్‌ మృతి చెందాడు. ఎస్సై వేణుగోపాల్‌ కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌ మండలం సుద్దాల గ్రామానికి చెందిన రాహుల్‌ కాట్నపల్లిలోని అత్తగాంటికి వెళ్లి తిరిగి సుద్దాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి బాబు(1) ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement