చెట్టమ్మ | - | Sakshi
Sakshi News home page

చెట్టమ్మ

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

చెట్టమ్మ

పచ్చని తల్లిరా మన చెట్టు

మూగజీవాలకు నీడపట్టు

పక్షి పిల్లలకు గూడుకట్టు

స్వచ్ఛమైన గాలిని వీచిపెట్టు

బాటసారులకు విశ్రాంతి గట్టు !

ఆరోగ్యానికి పండ్లు కోసిపెట్టు

అనారోగ్యానికి మందు రాసిపెట్టు

విస్తారమైన వర్షాలను రాబట్టు

కరువు కాటకాలను పోగొట్టు

గొడ్డలితో నరికితే పగబట్టు !

ప్రేమతో సాకితే ప్రాణభిక్ష పెట్టు

మొక్కలు నాటుటకు నడుంకట్టు

హరిత సేవకు శ్రీకారం చుట్టు

ప్రకృతి సంపదకు హారతి పట్టు

చెట్టమ్మకు చెయ్యెత్తి జైకొట్టు !!!

బోనగిరి. పాండురంగ

తొర్రూరు టౌన్‌

జిల్లా: మహబూబాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement