కరీంనగర్: మనిషి ఒక్కసారి తీవ్ర అనారోగ్యం పాలైతే అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా వైద్యానికే ఖర్చవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మానసిక ప్రశాంతతతో జీవించవచ్చని కరీంనగర్ మెడికవర్ వైద్యులు తెలిపారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో హెల్త్ సెక్టార్ ఉద్యోగులు, ప్రజలకు హెల్త్‌టాక్, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అతనికి అవసరమైన వైద్యాన్ని సమయానికి అందించేందుకు ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత ఆందోళన చెందడం కంటే ముందుగానే ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఉత్తమమని సూచించారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి వైద పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు రవికుమార్, లోకేశ్, రాకేశ్, ఉపేందర్‌రెడ్డి, తాహా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు కుమార్ గోపు, కడార్ల శ్రీనివాస్, మాదాసు సాగర్, హరీశ్, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, రఘు తదితరులు పాల్గొన్నారు.


