స్థానం పదిపోయింది! | - | Sakshi
Sakshi News home page

స్థానం పదిపోయింది!

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

13,137 మందికి 12,949 మంది పాస్‌ 98.57 శాతం ఉత్తీర్ణత.. ఫలితాల్లో సత్తాచాటిన బాలికలు మోడల్‌, కేజీబీవీ, గురుకులాల్లో వందశాతం నమోదు

కరీంనగర్‌టౌన్‌:

దోతరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఈ ఏడాది జిల్లా ఉత్తీర్ణతశాతంలో 8వ స్థానం దక్కించుకుంది. గత ఫలితాలతో పోలిస్తే వరుసగా వెనకపడిపోతోంది. ఈసారి పరీక్షలకు 6,856 మంది బాలురు హాజరుకాగా 6,734 మంది ఉత్తీర్ణత సాధించారు. 98.22శాతంగా నమోదు చే సుకున్నారు. 6,281మంది బాలికలు పరీక్ష రాయగా 6,215 మంది ఉత్తీర్ణత సాధించి 98.95శాతంగా నమోదు చేసుకున్నారు. మొత్తంగా 13,137మంది పరీక్షలు రాయగా 12,949మంది ఉత్తీర్ణత సాధించి, 98.57శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్నారు. 188 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.

సత్తా చాటిన మోడల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌లు

జిల్లావ్యాప్తంగా 12 కేజీబీవీల నుంచి 465 మందికి 463 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 11 మోడల్‌ స్కూళ్ల నుంచి 920 మంది పరీక్ష రాయగా 918మంది ఉత్తీర్ణత సాధించారు. 9 మైనార్టీ రెసిడెన్సియల్‌ స్కూళ్ల నుంచి 408 మంది పరీక్ష రాయగా 405మంది పాసయ్యారు. 125 జిల్లా పరిషత్‌ పాఠశాలల నుంచి 2,676 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,619 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరు సాంఘీక సంక్షేమ పాఠశాలల నుంచి 390మందికి 390మంది పాసయ్యారు. 20 ప్రభుత్వ పాఠశాలల నుంచి 802 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 729 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 160 మందికి 156మంది ఉత్తీర్ణులయ్యారు. 11 బీసీ వసతి గృహాల నుంచి 680మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 677 మంది ఉత్తీర్ణత సాధించారు. 145 ప్రైవేటు పాఠశాలల నుంచి 6,636 విద్యార్థులు పరీక్షలు రాయగా 6,592 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 25 మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల నుంచి 1,743 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 1,739 మంది ఉత్తీర్ణత సాధించారని ఉమ్మడి జిల్లా కో– ఆర్డినేటర్‌ అంజలి తెలిపారు.

జూన్‌ 5 నుంచి సప్లిమెంటరీ

ఫెయిల్‌ అయిన విద్యార్థులు నేటి నుంచి మే 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారికి జూన్‌ 5 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారం కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలి.

Advertisement
 
Advertisement
Advertisement