చోరీకేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీకేసులో నిందితుడి అరెస్టు

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

కరీంనగర్‌క్రైం: జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.5లక్షల నగదు, 10 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. సీపీ గౌస్‌ ఆలం సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్‌(32) పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీయాక్ట్‌పై జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నెల 26న వేకువజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన రూ.5లక్షల నగదు, బంగారు చైన్‌ చోరీ చేశాడు. ఆ సొత్తును తన ఇంటి వెనుక ఉన్న కట్టెలమండిలో దాచిపెట్టాడు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్టు చేశారు. రూ.5లక్షల నగదు, బంగారు చైన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోనూ చింతకుంట ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. ఏసీపీ వెంటకస్వామి, సీఐ సృజన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement