మెరిసిన ‘అల్ఫోర్స్‌’ ఆణిముత్యాలు | - | Sakshi
Sakshi News home page

మెరిసిన ‘అల్ఫోర్స్‌’ ఆణిముత్యాలు

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): ఇంటర్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు సత్తాచాటారు. కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ టైనీటాట్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వీఎన్‌ఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులతో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జయకేతనం ఎగురవేయడమే కాకుండా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించడం గర్వంగా ఉందన్నారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 1000 మార్కులకు కె.పల్లవి, జి.హైంథవి, డి.ప్రణవి, వై.శ్రీనిత్య 996 మార్కులు సాధించారన్నారు. సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో 1000 మార్కులకు ఆర్‌.వైష్ణవి 995, కె.హారిక, నభిలాతాహేన్‌, ఎస్‌.బ్రహ్మాణి, ఎస్‌.ఐశ్వర్య 995 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో కె.మానస 988, సీఈసీలో పి.బావోజ్ఞ 987 మార్కులు సాధించారని తెలిపారు. ఫస్టియర్‌ ఎంపీసీలో డి.వినీష, జి.అక్షర 469, బైపీసీలో ఎస్‌.జాగృతి, ఏ.హస్విత, ఖాన్సా అలియా, జి.కావ్యశ్రీ 439 మార్కులు, ఎంఈసీలో ఎం.మహాలక్ష్మి 493, సీఈసీలో వి.దీక్షిత, అనామ్మహ్రూజ్‌ 494 మార్కులు సాధించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement