‘ట్రినిటి’ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

‘ట్రినిటి’ ప్రభంజనం

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

‘ట్రినిటి’ ప్రభంజనం

కరీంనగర్‌టౌన్‌/సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఇంటర్‌ ఫలితాల్లో కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సహస్ర, వికిత, నేహ, శ్రీతులసి, మధురిమ, హారి క 995 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో హసిబా ఉమామ, అయేషా ఫాతిమా, హాసిని 995 మార్కులతో సత్తా చాటినట్లు తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్‌లో ప్రహలా ప్రాంసిక, లాస్య, శ్రీచరణి, లహరి, కీర్తన 468 మార్కులు, బైపీసీలో సోనియా బిస్తా, అఖిల, విష్ణుప్రియ, అక్షర, మనీష 438 మార్కులు సాధించినట్లు తెలిపారు. సెకండియర్‌లో 990 పైగా మార్కులు 71మంది, ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 465 మార్కులకు పైగా 41మంది, బైపీసీలో 435మార్కులకు పైగా 10మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. వీరిని కళాశాల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్‌ దాసరి మమతరెడ్డి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement