కరీంనగర్‌టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని ఎస్వీజేసీ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు కై వసం చేసుకున్నారని కళాశాలల సెక్రటరీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యక్షుడు ఊట్కూరి మహేందర్‌రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 994, 992 ,992 ,991, 991, మొదటి సంవత్సరం ఎంపీసీలో 468 ,467, 466, 465, 464, బైపీసీలో 435, 434, 432, సీఈసీలో 490 489, 486 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌లు, డైరెక్టర్లు కాంతాల రాంరెడ్డి, మేడ వెంకటవరప్రసాద్, సింహాచల హరికృష్ణ, వంగల సంతోష్‌రెడ్డి అభినందించారు.


