‘అక్షర పౌర్ణమి’కి ఆఖరి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

‘అక్షర పౌర్ణమి’కి ఆఖరి వీడ్కోలు

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

మలయశ్రీ పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న సాహితీవేత్తలు మలయశ్రీ రచనలు

విద్యానగర్‌(కరీంనగర్‌)/కరీంనగర్‌ కల్చరల్‌: శతాధిక గ్రంథకర్త, రంగస్థల నటులు, వేమన నాటక దర్శకులు మలయశ్రీ మృతి తీరని లోటని కవులు, సాహితీవేత్తలు అన్నారు. పద్యం, గద్యం, కథ నవల, బాల సాహిత్యం, సాహితీ విమర్శ, అనువాదాలు, నాటక ప్రక్రియలో రచనలు చేసి కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్రపై పరిశోధనాత్మక గ్రంథాన్ని అందించి సాహిత్య చరిత్రలో తన పత్య్రేకతను చాటుకుంటు తన పుట్టిన రోజు అయిన కార్తీక పున్నమి సందర్భంగా పత్రి పౌర్ణమి రోజు సాటి కవులు, సాహితీవేత్తలను సాదరంగా సత్కరించే కవి, రచయిత డా.మలయశ్రీ గురించి సాహితీవేత్తల మదిలోని భావాలు.

ఏటా తన పుట్టిన రోజున..

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామంలో 1940 సంవత్సరంలో కార్తీక పున్నమి రోజు జన్మించిన డా.మలయశ్రీ కరీంనగర్‌లోని రేకుర్తిలో స్థిరపడ్డారు. ఎంఏ(తెలుగు), ఎంఓఎల్‌, పీహెచ్‌డీ చదివిన ఆయన తెలుగు పండిత్‌ ఉపాధ్యాయునిగా, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి విరమణ పొందారు. ఆయన రాసిన శాంతిపథం ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉపవాచకంగా ఉండేది. కరీంనగర్‌ వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందారు. తన ఇద్దరు పిల్లలకు ఆదర్శ వివాహాలు చేశారు. ఏటా తన పుట్టినరోజు అయిన కార్తీక పున్నమి రోజు సాహితీవేత్తలను సత్కరించేవారు. 1960 నుంచి రచనలు ప్రారంభించి 4 భాషల్లో దాదాపు 136పైగా రచనలు చేసిన ఆయన అందుకోని అవా ర్డు, పొందని సత్కారం లేదంటే అతిశయోక్తి కాదు. అభ్యుదయవాదిగా, బౌద్ధేయవాదిగా నమ్మి న ఆశయాలు, సిద్ధాంతాలతో జీవితాన్ని చివరి వర కు సా గించిన ఆయన అనారోగ్యంతో శుక్రవారం కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు కు టుంబ సభ్యులు స్వగృహానికి తరలించగా శని వారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రచయితలు వేణుశ్రీ, సరిపల్లి కృష్ణారెడ్డి, బాలసాని రాజ య్య, కూకట్ల తిరుపతి, లక్ష్మణబోధి, గండ్ర లక్ష్మణ రావు, బూర్ల వెంకటేశ్వర్లు, రంగినేని మోహనరావు, జూకంటి జగన్నాథం, కలవకుంట్ల రామకృష్ణ, సబ్బని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ మలయశ్రీకి సాహితీవేత్తల కన్నీటి నివాళి

Advertisement
 
Advertisement
Advertisement