బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

వేములవాడ: వేములవాడ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పిట్టల భూమేశ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు బుధవారం ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి, కోర్టు ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పిట్టల మనోహర్‌ మాట్లాడుతూ ధర్మపురికి చెందిన రౌడీషీటర్‌ గంగాధర్‌ పిట్టల భూమేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు శంకర్‌, ప్రధాన కార్యదర్శి భానుకృష్ణ, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి జెట్టి శేఖర్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement