అమ్మా నేను వెళ్లిపోతున్నా.. క్షమించు | - | Sakshi
Sakshi News home page

అమ్మా నేను వెళ్లిపోతున్నా.. క్షమించు

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

ముస్తాబాద్‌: అమ్మా నేను వెళ్లిపోతున్న.. ఈ అప్పులు భరించలేను. బాపు చనిపోయాక నిన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్లిపోతున్న.. నన్ను క్షమించు అమ్మ.. అంటూ ఓ కొడుకు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన పాకదాని నర్సింలు(35) ఇంట్లో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నర్సింలు తండ్రి చంద్రయ్య 2020లో కరోనాతో మృతి చెందగా, అప్పటి నుంచి తల్లి ఎల్లవ్వను పోషిస్తున్నాడు. ఇంకా పెళ్లికాని నర్సింలు స్వగ్రా మం పోతుగల్‌కు ఒక్కడే వచ్చి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నర్సింలు తన ఆత్మహత్యకు అప్పులే కారణమని లేఖలో రాశాడు. అమ్మను ఎవరు ఏమీ అనవద్దని, స్నేహితులు ఆమెను చూసుకోవాలని కోరాడు. కొడుకు మృతితో తల్లి ఎల్లవ్వ ఒంటరి అయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

అమ్మను బాగా చూసుకోవాలి

కారు డ్రైవర్‌ ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement