శంకరపట్నం: గద్దపాక గ్రామానికి చెందిన భూమ అరవింద్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ముదిరాజ్ కుటుంబానికి చెందిన గద్దపాక మాజీ ఎంపీటీసీ భూమ సంపత్–వసంత కుమారుడు అరవింద్ ఎస్సెస్సీ వరకు వీణవంక, ఇంటర్ అల్గునూర్ ఎస్‌ఆర్ కాలేజీలో చదువుకున్నాడు. వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఈ ఏడాది జనవరి 18, 19ల్లో కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యూయేషన్ లెవల్ ఫైనల్ పరీక్షలు నిర్వహించింది. బుధవారం ఫలితాలు విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా 1,024 ర్యాంక్ సాధించిన అరవింద్ జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పలువురు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అభినందనలు తెలిపారు.


