కరీంనగర్ సిటీ: ప్రతీ విద్యార్థి తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకొని వాటి సాధనకు కృషి చేయాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ తెలిపారు. వాగేశ్వరి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ బుధవారం ఘనంగా అకాడమిక్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉమేశ్‌కుమార్ హాజరై మా ట్లాడారు. వాగేశ్వరి విద్యాసంస్థల పనితీరును ప్రశంసించారు. కళాశాల విశ్వవిద్యాలయం పరిధిలో ఫలి తాలు, అడ్మిషన్లు, క్రీడలతోపాటు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. వాగేశ్వరి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ బి.వి. ఆర్.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వాగేశ్వరి విద్యాసంస్థలు విద్య, క్రమశిక్షణ అన్ని కార్యకలాపాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయన్నారు. పలు పరీక్షలు, విద్య, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వీసీ మెమెంటోలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహం నింపాయి. సాహితీ గ్రూప్ ఆఫ్ కాలేజీ అధినేత ప్రభాకర్‌గౌడ్, నిగమా ఇంజినీరింగ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ రత్న గోపాల్‌రెడ్డి, వాగేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు వెంకట్‌రెడ్డి, సతీశ్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ లింగమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.
శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్


