భక్తుడి బ్రాస్‌లెట్‌ అప్పగించిన వ్యాపారి | - | Sakshi
Sakshi News home page

భక్తుడి బ్రాస్‌లెట్‌ అప్పగించిన వ్యాపారి

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

వేములవాడఅర్బన్‌: భీమేశ్వరస్వామి దర్శనానికి మంగళవారం వచ్చిన ఓ భక్తుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్‌లెట్‌ను వ్యాపారి తిరిగి అప్పగించారు. నర్సంపేటకు చెందిన ప్రణయ్‌ స్వామివారి దర్శనం అనంతరం బయటకు వెళ్తుండగా బంగారు బ్రాస్‌లెట్‌ ఆలయం పరిసరాల్లో పడిపోయింది. అక్కడే ప్యాలాలు విక్రయించుకునే వారికి దొరకడంతో తమదంటే తమదని వాదనకు దిగారు. వేములవాడలోని గాంధీనగర్‌లో పదేళ్లుగా సోడాబండి వ్యాపారం చేస్తున్న కొంపల్లి రమేశ్‌ ఆ బ్రాస్‌లెట్‌ను తీసుకొని ఆలయంలోని ఎస్పీఎఫ్‌ హోంగార్డులకు అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మకు తెలియడంతో భక్తుడు ప్రణయ్‌కు ఈవో అంజనారెడ్డి చేతుల మీదుగా అప్పజెప్పారు. నిజాయితీగా వ్యవహరించిన కొంపల్లి రమేశ్‌ను ఈవో అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement