వ్యాధులు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాధులు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

కరీంనగర్‌: వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని మన ఆరోగ్యం– మన బాధ్యత అనే భావనతో జీవనశైలిని మార్చుకోవాలని మెడికవర్‌ వైద్యులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రిలో నిర్వహించిన ఆరోగ్య అవగహన కార్యక్రమంలో మాట్లాడారు. షుగర్‌, బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వంటి వ్యాధులు వచ్చినప్పుడు సోషల్‌ మీడియాపై ఆధారపడి స్వయంగా మందులు వాడడం ప్రమాదకరమని హెచ్చరించారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందడం అవసరమన్నారు. మద్యం, పొగ తాగడం, డ్రగ్స్‌ వినియోగం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వంటి అలవాట్లను మానుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, పనిలో ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి నిద్ర ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. ప్రస్తుతం 100 మందిని పరీక్షిస్తే 80 మందికి కొలెస్ట్రాల్‌ సమస్య ఉంటుందని, వారు రెగ్యులర్‌గా చికిత్స పొందకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటేనే మంచి భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సెంటర్‌హెడ్‌ గుర్రం కిరణ్‌, కార్డియాలజిస్టు అనీష్‌ పబ్బ, జనరల్‌ ఫిజీషియన్లు నాగరాజు, లోకేష్‌, క్రిటికల్‌కేర్‌ డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, జనరల్‌ సర్జన్‌ తాహా, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రియాంక, మార్కెటింగ్‌ మేనేజర్‌ కోట కర్ణాకర్‌, దాసరి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement