● అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
కరీంనగర్: ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మాసిపెద్ది నారాయణరావు పొలానికి నీరు పెట్టేందుకు ఈనెల 2న బైక్‌పై వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కారులో ధర్మపురి నుంచి కరీంనగర్‌కు వెళ్తూ అంబరిపేట స్టేజీ వద్ద ఢీకొంది. ఈ ఘటనలో నారాయణరావు తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. విషయాన్ని వైద్యులు వారి కుటుంబసభ్యులకు తెలియజేయగా భార్య రాణి, కుమారులు రఘుపతిరావు, రాకేశ్‌రావు నారాయణ రావు అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. జీవన్‌దాన్ సంస్థకు సమాచారం అందించారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి రెండు కిడ్నీలు, లివర్ ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తమ తండ్రి అవయవాలు మరొకరికి జీవితాన్ని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
ముత్తారంలో మహిళ..
ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్) గ్రామానికి చెందిన తుండ్ల సుమతి(50) పురుగుల మందు తాగిన మైకంలో కాలుజారీ వ్యవసాయ బావిలోపడగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈనెల 4న ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగిన సుమతి.. తనఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.


