నృసింహుని సన్నిధిలో న్యాయమూర్తుల పూజలు | - | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో న్యాయమూర్తుల పూజలు

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

భీమన్నా కరుణించుస్వామి

వేములవాడ: రాజన్న సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన 40 వేల మంది భక్తులు రాజన్న, భీమన్నలను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. భీమేశ్వర స్వామిని టీజీఎన్‌పీజీలీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్ణాటి వరుణ్‌రెడ్డి దర్శించుకున్నారు.

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి సాయిరామ దేవి దంపతులు, జిల్లా అడిషనల్‌, సెషన్స్‌ న్యాయమూర్తి జయప్రసాద్‌ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా దేవస్థానం పక్షాన సంప్రదాయ రీతిలో మేళతాళాలతో ఆహ్వానం పలికారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాలు శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement