వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి ఆత్మహత్య

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని యామపూర్‌కు చెందిన జంబుక ఆశన్న(78) జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. ఆశన్న భార్య 20ఏళ్ల క్రితం మృతి చెందింది. ముగ్గురు కుమారులు ఉన్నా.. ఒంటరిగా ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున ఉరేసుకున్నాడు. ఆశన్న చిన్నకోడలు మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): గడ్డి మందు తాగి చికిత్స పొందుతున్న కడాలి సుబ్రహ్మణ్యం(43) శనివారం మరణించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసేవాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం 15 ఏళ్లుగా ఇల్లంతకుంటలోనే ఉంటున్నాడు. గత సోమవారం గడ్డిమందు తాగగా బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న అతడిని స్వగ్రామానికి తరలించగా ప్రాణాలు వదిలాడు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి

జగిత్యాలక్రైం: తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని పేర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన పొద్దుటూరి అజిత్‌ (23) కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి అతడి ప్రేమను అగీకరించడంలేదన్న మనస్తాపంతో గత నెల17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అజిత్‌ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధి సుగ్లాంపల్లికి చెందిన రైతు చల్ల కనుకయ్య(48) ఆదివారం విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. ఎస్సై చంద్రకుమార్‌ తెలిపిన వివరాలు.. కనుకయ్య తన ఇంటి సమీపాన ఉన్న వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి మోటార్‌ ఆన్‌ చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

కులం పేరుతో దూషించిన వ్యక్తులపై కేసు

బుగ్గారం: మండల కేంద్రానికి చెందిన దూడ కిరణ్‌ను కులం పేరుతో దూషించిన ఘటనలో అదే గ్రామానికి చెందిన నగునూరి రాజశేఖర్‌, మట్టి అమర్నాథ్‌, గర్వందుల రోహన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు. గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న కిరణ్‌.. రాజశేఖర్‌కు చెందిన ఫ్లెక్సీని తీసివేశాడనే కారణంతో మిత్రులతో కలిసి కిరణ్‌పై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement