సెలవుపై రాజన్న ఆలయ ఈవో | - | Sakshi
Sakshi News home page

సెలవుపై రాజన్న ఆలయ ఈవో

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

– ఇన్‌చార్జి ఈవోగా అంజనారెడ్డి బాధ్యతలు స్వీకారం

వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి 13 రోజుల సెలవుపై వెళ్లడంతో కొండగట్టు అంజన్న ఆలయ ఈవో అంజనారెడ్డిని ఇన్‌చార్జిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ఆయన వేములవాడకు చేరుకుని భీమన్నను దర్శించుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఏఈవో జి.శ్రావణ్‌కుమార్‌, జయకుమారి, డీఈ రఘునందన్‌ ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

ఇసుక తవ్వకాలు అడ్డగింత

చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ మోయతుమ్మెద వాగులో ఇసుక తవ్వకాలను సర్పంచ్‌ వంటకాల కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి శివారు దాటి రామంచ శివారులోని వాగులో రెండు జేసీబీలు ఇసుకను తోడేస్తుండగా అడ్డుకుని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. ఎల్‌ఎండీలో పూడికతీతలో భాగంగా ఇసుకను తోడాలి కానీ.. తమ గ్రామ పరిధిలో పూడికతీయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరిగేషన్‌ ఈఈకి ఫోన్‌చేసినా స్పందనలేదని సర్పంచ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement