హత్య చేసి.. ఆపై పారిపోయి | - | Sakshi
Sakshi News home page

హత్య చేసి.. ఆపై పారిపోయి

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

వేములవాడ: 2011లో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండపల్లి బుచ్చయ్యను ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ తెలిపారు. 2011లో వేములవాడలో కొండపల్లి జమున, ఆమె భర్త కొండపల్లి బుచ్చయ్యహత్యకు సంబంధించి కేసు నమోదైందన్నారు. విచారణ పూర్తయి నిందితుడికి శిక్ష విధించినప్పటికీ కొండపల్లి బుచ్చయ్య తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు. ఈక్రమంలో కోర్టు అతనిపై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందని వివరించార. ఎస్సై రామ్మోహన్‌, కానిస్టేబుళ్లు గోపాల్‌, ఇమ్రాన్‌ ప్రజ్ఞాపూర్‌ వద్ద అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై రామ్మోహన్‌, కానిస్టేబుళ్లు గోపాల్‌, ఇమ్రాన్‌లను సీఐ అనందించారు.

15 ఏళ్లకు దొరికిన నిందితుడు

Advertisement
 
Advertisement
Advertisement