ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్–గూడెం మధ్యమానేరు కెనాల్‌లో ఓ కారు బోల్తాపడింది. ఆదివారం తెల్లవారుజామున దుబ్బాకకు చెందిన కారు సిరిసిల్ల వైపు వెళ్తుండగా అదుపుతప్పి కెనాల్‌లో బోల్తాపడినట్లు ఏఎస్సై అబ్దుల్ ఘనీ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలిసిందన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆవునూర్ నుంచి ముస్తాబాద్ వరకు ఉన్న రహదారిలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానేరు కెనాల్‌తోపాటు రామ్‌రెడ్డిపల్లి వై జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికై నా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి హెచ్చరికబోర్డులతోపాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు.


