గంగారంలో క్షుద్రపూజల కలకలం | - | Sakshi
Sakshi News home page

గంగారంలో క్షుద్రపూజల కలకలం

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): మండలంలోని గంగారం గ్రామంలో ఆదివారం ఉదయం క్షుద్రపూజల ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులోని హుస్సేన్‌మియా వాగు వంతెన కింద ఇద్దరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తుండగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పూజలు నిర్వహిస్తున్న అప్పన్నపేట గ్రామానికి చెందిన మోటం సమ్మయ్య, రేవెల్లి సంపత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్రపూజల పేరిట అమాయకులను మోసం చేస్తున్నారని అలాంటివారిని నమ్మవద్దని ఎస్సై సూచించారు. కాగా, గతంలో ఇదే వంతెన కింద ఒకరిని పూజల పేరిట బలి ఇచ్చిన ఘటన ఇక్కడి ప్రజలు మరిచి పోలేదు. మండలంలోని మంథని క్రాస్‌రోడ్డు, పొత్కపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద పందిని బలి ఇచ్చిన ఘటనలూ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement