కొత్తపల్లి/ విద్యానగర్: రేకుర్తిలోని లయన్స్‌క్లబ్ డా.భాస్కర్ మడేకర్ చారిటబుల్ కంటి ఆసుపత్రి నూతన ట్రస్ట్ బోర్డు నియామకం జరిగింది. చైర్మన్‌గా ప్రకాశ్‌హోల్లా, కార్యదర్శిగా కోల అన్నారెడ్డి, కోశాధికారిగా బొమ్మ పవన్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా చిదుర సురేశ్, కార్యవర్గ సభ్యులుగా కొండ వేణుమూర్తి, టి.మురళీధర్‌రావులు నియమితులయ్యారు.
హరిశంకర్ నోరు అదుపులో పెట్టుకో..
● బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ సోమిడి వేణు
కరీంనగర్: గద్దెదించి.. జనం ఛీకొట్టినా బీఆర్‌ఎస్ నేతలకు అహంకారం తగ్గడం లేదని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ విమర్శించారు. గురువారం మైత్రి కన్వెన్షన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి కరీంనగర్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని బీఆర్‌ఎస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కరీంనగర్‌ను లండన్‌లా చేస్తామన్న హామీ నీటిమూటనే అయిందన్నారు. మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్‌ఎస్ పార్టీయేనన్నారు. కార్పొరేటర్‌గా గెలవని చల్ల హరిశంకర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను విమర్శించే స్థాయి లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి, ఎంఆర్‌ఎఫ్ పేరిట నాసిరకం చెక్‌డ్యాం పనులు చేసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ కార్పొరేటర్స్ ఒంటెల సత్యనారాయణరెడ్డి, బండ రమణారెడ్డి, గాజే శివరాం, మాసం గణేశ్, కర్రె అనిల్, విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కోల అన్నారెడ్డి
పకాశ్ హోల్లా


