కాషాయమయం | - | Sakshi
Sakshi News home page

కాషాయమయం

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

కోనేరులో స్నానమాచరిస్తున్న భక్తులు

కొండగట్టుకు ఇరుముడితో వచ్చిన దీక్ష పరులు

ఆలయంలో కిక్కిరిసిన భక్తులు

మల్యాల: హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా గురువారం కొండగ ట్టు ఆంజనేయస్వామి క్షేత్రం కాషాయమయమైంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై హనుమాన్‌.. జై శ్రీరాం.. రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ అంటూ మార్మోగాయి. ఆలయంలో మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించి విశేషాలంకరణ చేశా రు. దీక్షాపరులు స్వామివా రిని దర్శించుకొని ఇరుముడులు సమర్పించి మా ల విరమణ చేశారు. ఏర్పాట్లను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పరిశీలించారు.

ఒకేరోజు సుమారు లక్షన్నర మంది దర్శనం

వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దీక్షాపరులు అర్ధరాత్రి వరకు కొండపై సేద తీరి, తెల్లవారుజామున దీక్ష విరమణ చేసి, కోనేటిలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు సుమారు లక్షన్నరకుపైగా స్వామివారిని దర్శించుకున్నట్లు, ఆలయ అధికారులు తెలిపారు.

అంజన్న దీక్షస్వాములతో కిక్కిరిసిన కొండగట్టు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ఘనంగా హనుమాన్‌ చిన్న జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement