అఖండజ్యోతికి అరుదైన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అఖండజ్యోతికి అరుదైన గుర్తింపు

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ నంద దీపానికి అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. ఈమేరకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు అధికారుల బృందం గురువారం ఆలయాన్ని సందర్శించి రికార్డుపత్రాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ మల్లుగారి నర్సాగౌడ్‌కు అందించారు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన అఖండ నంద దీపం నిత్యం వెలుగుతూనే ఉంటోంది. భక్తుల సంప్రదాయ పరిరక్షణ, ఆధ్యాత్మిక నిబద్ధతకు నందదీపం నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు నిత్యం ఇంధనం సమకూరుస్తూ పవిత్రజ్యోతిని కాపాడుతుండడం అరుదైన సామూహిక ఆధ్యాత్మిక సేవగా గుర్తించారు. కార్యక్రమంలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు వ్యవస్థాపకులు చింతపట్ల వెంకటాచారి, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement