కరీంనగర్‌రూరల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామసభలను నిర్వహిస్తోందని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. కరీంనగర్ మండలం నగునూరు గ్రామసభను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం 99రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక చేపట్టిందన్నారు. సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సభలు ఎంతోగా దోహదపడతాయని తెలిపారు. సంక్షేమ పథకాల్లోని ఇబ్బందులను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం వివిధ ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆర్డీవో మహేశ్వర్, సర్పంచ్ సాయిల్ల శ్రావణి, ఉపసర్పంచ్ బోనగిరి హన్మంతరావు, తహసీల్దార్ లక్ష్మీనర్సింహరావు, ఎంపీవో జగన్మోహన్‌రెడ్డి, కార్యదర్శి లచ్చయ్య పాల్గొన్నారు.


