పెద్దపల్లి: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన బాలికలు వివిధ పోటీపరీక్షలు రాసేందుకు రాష్ట్రప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. కేజీబీవీల్లో అధిక సంఖ్యలో పేద విద్యార్థునులే విద్యాభ్యాసం చేస్తున్నారు. అర్హత, నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం లేక పోటీ పరీక్షలు రాయలేకపోతున్నారు. దీనిని గమనించి ప్రభుత్వం ఉన్నత విద్యలో కార్పొరేట్‌స్థాయిలో సీట్లు సాధించేలా తర్ఫీదు ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఉచితంగా నోట్‌బుక్కులు పంపిణీ చేస్తోంది.
వైద్యం, ఇంజినీరింగ్‌పై ప్రత్యేక దృష్టి
ఇంటర్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నీట్, జేఈఈ, క్లాట్ వంటి రాష్ట్ర, జాతీయ పోటీపరీక్షల్లో ప్రతిభ చాటేందుకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తంది. వీరికోసం జూలపల్లిలో నీట్, రామగుండంలో జేఈఈ, సుల్తానాబాద్‌లో క్లాట్ కోచింగ్ ఇప్పిస్తోంది.
ప్రతీ తరగతికి 40 మంది ఎంపిక
ఎంపిక చేసిన కేజీబీవీల్లో ఆసక్తిగల విద్యార్థినులకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రతీ తరగతిలో 40 మందిని ఎంపికచేస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిన తర్ఫీదు ఇస్తారు. ఈ సందర్భంగా బాలికల అభివృద్ధి జిల్లా అధికారి కవిత మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి కాలేజీల్లో సీట్లు సాధించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రభుత్వం స్టడీ మెటీరియల్ అందిస్తోంని తెలిపారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా మాక్ టెస్టులు నిర్వహిస్తూ నైపుణ్యం పెంచుతామని వివరించారు.
పోటీపరీక్షలకు శిక్షణ
ఎంపిక చేసిన బాలికలకు తర్ఫీదు


