● కలెక్టర్ చిత్రా మిశ్రా ● సీఓఈ ఆకస్మిక తనిఖీ
తిమ్మాపూర్: మండలంలోని అలుగునూరు శివారులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కేంద్రాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించారు. బోధన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు ఎలా చదువుతున్నారు.. విద్యా బోధన ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా... బ్రేక్ ఫాస్ట్, ఫుడ్ మంచిగా పెడుతున్నారా..అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని సూచించారు. తరగతి గదులతో పాటు వాష్రూమ్స్, కిచెన్, డైనింగ్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని పరిశీలించారు. మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయ బృందం కఠోరంగా శ్రమించాలన్నారు. గురుకులం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. సోషల్ వెల్ఫేర్ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ తిరుపతిరావు, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవి పాల్గొన్నారు.
కరీంనగర్‌క్రైం: న్యాయవాదుల సమస్కల పరిష్కారానికి కృషి చేస్తానని బార్ కౌన్సిల్ సభ్యుడు పొన్నం అశోక్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కరీంనగర్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. న్యాయవాదులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా గడ్డం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బండ శివకుమార్, బొడ్ల గీతారాణి, ప్రధాన కార్యదర్శి చంద్రపాటి కిరణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శులు సుంకే దేవకిషన్, మంగపల్లి అనురాధ, కోశాధికారి బొజ్జ స్వామి, లైబ్రరీ కార్యదర్శి బోడపట్ల రాజేశ్, స్పోర్ట్స్ కల్చరల్ కార్యదర్శి బెజ్జంకి శ్రీకాంత్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ముప్పిడి మదన్‌బాబు, సీహెచ్ భూమాచారి, నీరుమల్ల సంధ్యారాణి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బెజ్జంకి శ్రీనివాస్, బి.శాంతికుమార్, జి.కరుణశ్రీ ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ, న్యాయవాదుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అందరి సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం కార్యవర్గాన్ని సీనియర్, జూనియర్ న్యాయవాదులు సన్మానించారు.
కరీంనగర్‌టౌన్: తమకు మేయర్ పదవి ఇస్తే కేంద్రం నుంచి ఏడాదికి రూ.200 కోట్లు నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన బండి సంజయ్ మున్సిపల్ బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎందుకు పెట్టలేదని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. మున్సిపల్ బడ్జెట్‌పై బుధవారం మాట్లాడారు. ప్రత్యేక అధికారుల పాలనలో రూపొందించిన బడ్జెట్‌ను కాపీ పేస్ట్ చేసి పెట్టారని, బడ్జెట్‌లో నిధులు ఎలా సమీకరిస్తారో పేర్కొనలేదని ఎద్దేవా చేశారు. పండుగలకు పెట్టే ఖర్చులను తగ్గించిన బీజేపీ పాలకవర్గం, అవసరం లేకున్నా నియమించిన ఉద్యోగులు, వారు వాడుతున్న వాహనాల వృథా ఖర్చులు తగ్గించాలన్నారు. 18 వేల ఇళ్లపై పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని, ప్రజలపై పన్నుల భారం వేయద్దన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను చూస్తే జాలేస్తుందని, అధికారంలో ఉండి కుక్కలు, కోతుల బెడద గురించి నిరసన తెలపడం శోచనీయమన్నారు. ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత అక్రమ కట్టడం అంటూ నోటీసులు ఇచ్చి కాంగ్రెస్, బీజేపీ కమీషన్ల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. మాజీ కార్పొరేటర్ కచ్చు రవి, బండ శ్రీకాంత్, రాజకుమార్, గడ్డం ప్రశాంత్‌రెడ్డి, షౌకత్, వాజిద్, గంగాధర చందు, ఆరె రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, తొంటి రాజేందర్, మంతెన కిరణ్, గూడెల్లి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


