మహిళల జీవితాల్లో ‘మహాలక్ష్మి’ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

మహిళల జీవితాల్లో ‘మహాలక్ష్మి’ వెలుగులు

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

కరీంనగర్‌టౌన్‌: మహిళల జీవితాల్లో ‘మహాలక్షి’ పథకం వెలుగులు నింపుతోందని కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. మంగళవారం బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహిళలు, విద్యార్థులు కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ పనుల కోసం వెళ్లేందుకు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6.91 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూపారాణి, ఆర్టీసీ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సోలోమన్‌, కరీంనగర్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.రాజు, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లు పి.మల్లేశం, ఎస్‌. భూపతిరెడ్డి, వన్‌ డిపో మేనేజర్‌ విజయ మాధురి, పర్సనల్‌ ఆఫీసర్‌ సంపత్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

గ్రామసభలు విజయవంతం చేయాలి

కరీంనగర్‌అర్బన్‌: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈనెల 2న జిల్లాలో గ్రామసభలు విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్షలో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామసభల్లో తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీవాకడే, జెడ్పీ సీఈవో శ్రీనివాస్‌, డీపీవో జగదీశ్వర్‌, డీఆర్డీవో శ్రీధర్‌, గృహనిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement