దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై విచారణ

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

సైదాపూర్‌(హుస్నాబాద్‌): దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. గతేడాది మే 8న సైదాపూర్‌– మొలంగూర్‌ రోడ్‌లోని సోమారం శివారులో కెనాల్‌ వద్ద అప్పటి ఎస్సై ఆగస్త్య భార్గవ్‌, సిబ్బంది డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఆ సమయంలో మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్‌ మొలంగూర్‌ నుంచి సైదాపూర్‌ వస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులు, మహేందర్‌ మధ్య గొడవ జరిగింది. పోలీసులు అకారణంగా నడిరోడ్‌పై చితకబాదారని, కులంపేరుతో దూషించారని, ఎస్సై భార్గవ్‌పై చర్యలు తీసుకోవాలని మహేందర్‌ జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు, మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. కోర్టును సైతం ఆశ్రయించాడు. ఈనేపథ్యంలో ఏసీపీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పటి సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఘటన జరిగి ఏడాది కావస్తున్నా ఉన్నతాధికారులు, కోర్టు, కమిషన్‌లకు చేసిన ఫిర్యాదులకు కదలిక వచ్చిందని, ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement