● డాక్టర్ దారం రఘురామన్
కరీంనగర్‌కల్చరల్: ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురైనా మనిషి మనుగడను సృజనాత్మకతే నిలబెడుతుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్ దారం రఘురామన్ అన్నారు. సోమవారం కేంద్ర సాహిత్య అకడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తెలుగులో రచించి తానే స్వయంగా ఇంగ్లి్‌ష్‌లోకి అనువదించిన ‘మానేరు తీరం’ ద్విభాషా కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ వుడుత చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్టు రావికంటి శ్రీనివాస్, కె.ఎస్.అనంతాచార్య, పి.ఎస్.రవీంద్ర, సాహితీవేత్తలు గాజుల రవీందర్, మాడిశెట్టి గోపాల్, సంకేపల్లి నాగేంద్రశర్మ, మెట్టు సుగేందర్, శ్రీపతి, పొయెట్రీ ఫోరం నిర్వాహకులు ఇందిరా రాణి, చందన పాల్గొన్నారు.
విద్యార్థులను చీపురుతో కొట్టిన హాస్టల్ కుకింగ్ హెల్పర్
జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ కుకింగ్ హెల్పర్ శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వస్తూ విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులను ప్రతిరోజు చీపుర్లతో కొడుతూ వేధిస్తున్నాడు. విషయాన్ని కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించారు. అయినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లడంతో ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. తమను కొడుతూ.. వేధిస్తున్నట్లు విద్యార్థులు తెలపడంతో నివేదికను కలెక్టర్‌కు అందించారు. ఆయన వెంటనే శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ ఇటీవలే డిప్యూటేషన్‌పై తాళ్లధర్మారం నుంచి ఇక్కడికి వచ్చాడు.


