రివర్‌ఫ్రంట్‌ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రివర్‌ఫ్రంట్‌ పనులు వేగవంతం చేయాలి

Mar 30 2026 8:46 AM | Updated on Mar 30 2026 8:46 AM

● త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

● త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌ అర్బన్‌: మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో మానేరు రివర్‌ ఫ్రంట్‌ పురోగతిపై మంత్రులు మంత్రి పొ న్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ భూసేకరణ, ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న నిధులు, ప్రాజెక్టు పూర్తికి ఎదురవుతున్న అడ్డంకులపై సుదీర్ఘంగా చర్చించారు. పనుల్లో జాప్యాన్ని నివారించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటకశాఖ నుంచి రూ.5 కోట్లతో పాటు ఈ సంవత్సరమే మరో రూ.10 కోట్లు విడుదల చేసేలా చూస్తామన్నారు. త్వరలోనే మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. మానకొండూరు ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌ చిత్రామిశ్రా, నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, ఆర్‌డీవో మహేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement